తిరువనంతపురం: ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ విధులను బహిష్కరించారు. (Booth Officers Boycott SIR Work) ఉద్యోగ సంఘాలు కూడా నిరసన తెలిపాయి. ‘సర్’ పనిని నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కేరళలో ‘సర్’ ప్రక్రియను ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో కన్నూర్‌లోని పయ్యన్నూర్‌లో బూత్ లెవల్ అధికారి (బీఎల్వో)గా పని చేస్తున్న 44 ఏళ్ల అనీష్ జార్జ్ ‘సర్’ పని వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘సర్’ పని ఒత్తిడి వల్ల సమయానికి తిండి తినక, నిద్రపోక అనీష్ జార్జ్ తీవ్ర ఆందోళన చెందినట్లు ఆయన కుటుంబం ఆరోపించింది.
కాగా, సహోద్యోగి మరణంపై బూత్ స్థాయి అధికారులు నిరసన తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన విధులను బహిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు నిర్వహించాయి.
మరోవైపు బూత్ స్థాయి అధికారులపై అధిక పని ఒత్తిడి కలిగించవద్దని ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే ‘సర్’ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి. కేరళ ఎన్జీవో అసోసియేషన్ కూడా ‘సర్’ వాయిదా డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కేరళలో ‘సర్’ను నిలిపివేయాలని ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేశాయి.
Also Read:
Fake Nandini Ghee | నకిలీ ‘నందిని’ నెయ్యి రాకెట్ గుట్టురట్టు.. జంతువుల కొవ్వు వాడకంపై దర్యాప్తు
Boy Trapped In Car Dies | ఆడుకుంటూ కారులో చిక్కుకున్న బాలుడు.. రెండు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు