తిరువనంతపురం: ఒక వ్యక్తి ఏఐ సాంకేతికతో జిప్‌లైన్ ప్రమాదం వీడియో సృష్టించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (AI Zipline Accident Video) ఈ వీడియో భయాందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేరళలో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన వయనాడ్‌లో జిప్‌లైన్ ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మహిళ, తన బిడ్డతో కలిసి జిప్‌లైన్ రైడ్‌కు వెళ్లగా అక్కడున్న సిబ్బంది అదుపుతప్పి పడిపోయిన వీడియో క్లిప్ భయాందోళన రేకెత్తింది.
కాగా, వయనాడ్ సైబర్ పోలీసులు దీనిపై స్పందించారు. అక్టోబర్ 30న కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వైరల్ అయిన ఆ వీడియో క్లిప్ ఏఐ ద్వారా సృష్టించినట్లు తెలుసుకున్నారు. ఆ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించారు. అలప్పుజ జిల్లా తైవెలిక్కం హౌజ్‌కు చెందిన 29 ఏళ్ల కే అష్కర్‌ను సోమవారం అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితుడు అష్కర్‌కు నేర చరిత్ర ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. దాడి, హత్యాయత్నం, మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు వంటి అనేక క్రిమినల్ కేసులు అతడిపై నమోదైనట్లు చెప్పారు. భయాన్ని లేదా ద్వేషాన్ని రేకెత్తించే, ప్రజల విశ్వాసాన్ని లేదా స్థానిక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే, తప్పుదారి పట్టించే ఏఐ వీడియోలు సృష్టించి వ్యాప్తి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వయనాడ్ జిల్లా పోలీసు అధికారి హెచ్చరించారు.
Also Read:
Watch: కొత్తగా కొనుగోలు చేసిన థార్‌లో సమస్యలు.. షోరూమ్‌కు లాక్కెళ్లిన గాడిదలు