Home
Khammam
Sarpanch Promises To Give Wardrobe To Brides Family In Sarpanch Election In Tekulapalli
Tekulapalli | సర్పంచ్ ఎన్నికల్లో హామీ.. పెళ్లి కూతురు కుటుంబానికి బీరువా అందజేసిన సర్పంచ్
Tekulapalli : టేకులపల్లి ఫిబ్రవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ రామా నాయక్ తన గ్రామ ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
Tekulapalli : టేకులపల్లి ఫిబ్రవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ రామా నాయక్ తన గ్రామ ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆదర్శంగా నిలిచారు. తాను గెలిస్తే ప్రతి ఇంటిలో ఆడపడుచుల పెళ్లి సందర్భంగా బీరువా అందజేస్తానని స్థానిక పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు.
ఈ మేరకు బుధవారం చుక్కల బోడు గ్రామపంచాయతీలో మాలోత్ కిషన్, జ్యోతి కుమార్తె వివాహం సందర్భంగా సర్పంచ్ బానోత్ రామా నాయక్ ఆ కుటుంబానికి బీరువా అందజేశారు. దీంతో బీరువా అందుకున్న కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. తమకు బహుమతి అందించిన సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీరువా అందజేశారని పంచాయతీ ప్రజలు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

