Honour Killing | డిప్యూటీ ఎమ్మార్వో లవ్ మ్యారేజి.. పెళ్లయిన కొద్ది గంటల్లోనే చెల్లెలి భర్తను చంపేసిన సోదరులు
Honour Killing | చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఉదయం అన్నవరంలో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ఆమె సోదరులు.. రాత్రికల్లా దంపతులను వెంబడించి పట్టుకుని వరుడిని రాళ్లతో కొట్టి హతమార్చారు.
Honour Killing | చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఉదయం అన్నవరంలో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ఆమె సోదరులు.. రాత్రికల్లా దంపతులను వెంబడించి పట్టుకుని వరుడిని రాళ్లతో కొట్టి హతమార్చారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ పరువు హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లికి చెందిన సంధ్య రాయపురం డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తోంది. ద్వారపూడికి చెందిన బట్టల వ్యాపారి సూర్యప్రకాశ్ రావును కొంతకాలంగా ప్రేమించింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో సంధ్య కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన సంధ్య ముగ్గురు సోదరులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెళ్లయిన కొద్ది గంటల్లోనే సూర్యప్రకాశ్రావుపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. తమ చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు.
ఈ పరువు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

