Fruits For Heart Health | ఈ పండ్లను రోజూ తింటే మీ గుండె సేఫ్.. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు..
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ ల కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. కనుక గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరం.
Fruits For Heart Health | శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ ల కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. కనుక గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యంగా ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పోషకాలన్ని కలిగి ఉన్న ఆహారాల్లో పండ్లు కూడా ఒకటి. పండ్లను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బెర్రీలు, యాపిల్ పండ్లు..
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో బెర్రీ జాతికి చెందిన పండ్లు ఎంతో సహాయపడతాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్రెర్రీ వంటి పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ప్రమాదాలను తగ్గించడంలో దోహదపడతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. స్మూతీ, పెరుగు, ఓట్ మీల్ వంటి వాటితో ఈ పండ్లను కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆపిల్ పండ్లు కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఈ ఫైబర్ సహాయపడుతుంది. ఆపిల్స్ పాలీఫినాల్స్ ను కూడా కలిగి ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయి. ఆపిల్ ను తొక్కతో సహా కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
అవకాడో, నారింజ పండ్లు..
అవకాడోలు మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. అవకాడోలను తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హోల్ గ్రెయిన్ టోస్ట్ లతో, సలాడ్స్, స్మూతీ వంటి వాటితో అవకాడోలను కలిపి తీసుకోవచ్చు. నారింజ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ధమనుల ధృడత్వాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. తాజా నారింజ పండ్ల రసాన్ని తీసుకోవడం లేదా నారింజ పండ్లను నేరుగా నమిలి తినడం వంటివి చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
దానిమ్మ పండ్లు..
ఇక దానిమ్మ పండ్లు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో దోహదపడతాయి. దానిమ్మ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్యూనికాలాజిన్లు ఉంటాయి. ఇవి ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడడంలో, రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. సలాడ్లు లేదా పెరుగు మీద దానిమ్మ గింజలను చల్లి తీసుకోవడం ద్వారా, స్వచ్ఛమైన దానిమ్మ పండ్ల రసాన్ని తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ విధమైన పండ్లను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

