Vaishnavi Chaitanya | తెలుగులో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబి సినిమాతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). ఈ భామ ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. కాగా ఈ బ్యూటీ ఇక తమిళంలో కూడా తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయిందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
వైష్ణవి చైతన్య, పాపులర్ కోలీవుడ్ కంపోజర్ కమ్ యాక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తాజా కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భామ ఇప్పటికే తమిళంలో అజిత్ కుమార్ నటించిన వలిమైలో కామియో రోల్లో మెరిసింది. ఇదే నిజమైతే వైష్ణవి చైతన్యకు తమిళంలో హీరోయిన్గా తొలి సినిమా ఇదే కానుంది.
మొత్తానికి వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టు తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది. మరి నుంచి రానున్న రోజుల్లో వైష్ణవి చైతన్య నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్.
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
| చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!