Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Star Kids | ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. స్టార్ హీరోల వారసులు అనగానే సాధారణంగా వెండితెరపై హీరోలుగా మెరవాలని అందరూ ఆశిస్తారు.
Star Kids | ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. స్టార్ హీరోల వారసులు అనగానే సాధారణంగా వెండితెరపై హీరోలుగా మెరవాలని అందరూ ఆశిస్తారు. కానీ, ఈ తరం స్టార్ కిడ్స్ మాత్రం కేవలం నటనకే పరిమితం కాకుండా, కెమెరా వెనుక ఉండి కథను నడిపించే ‘దర్శకత్వం’ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్, పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తదితరులు నటనవైపు కాకుండా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు.
1. ఆర్యన్ ఖాన్ (షారుఖ్ ఖాన్ కుమారుడు)
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నటనవైపు కాకుండా దర్శకత్వం వైపు అడుగులు వేసి తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అతడి దర్శకత్వంలో వచ్చిన బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు ప్రస్తుతం ఉన్నాడు ఆర్యన్ ఖాన్.
2. జేసన్ సంజయ్ (దళపతి విజయ్ కుమారుడు)
తమిళ సూపర్ స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ త్వరలోనే దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. విదేశాల్లో సినిమా మేకింగ్‌లో శిక్షణ పొందిన సంజయ్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో తన మొదటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిగ్మా అంటూ ఈ సినిమా రాబోతుండగా.. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.
3. అకిరా నందన్ (పవన్ కళ్యాణ్ తనయుడు)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా దర్శకత్వం మరియు టెక్నికల్ అంశాలపై మక్కువ చూపుతున్నట్లు తెలుస్తుంది. అమెరికాలోని ప్రముఖ ఫిల్మ్ స్కూల్ నుంచి సినిమాటోగ్రఫీ మరియు డైరెక్షన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అఖిరా. ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌కు మ్యూజిక్ అందించడమే కాకుండా, దర్శకత్వ విభాగంలో తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
4. అమృత్ మాధవన్ (ఆర్. మాధవన్ కుమారుడు)
నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్ అని అందరికీ తెలుసు. అయితే, మాధవన్ మేనల్లుడు మరియు కుటుంబంలోని ఇతర యువకులు కూడా సినిమా టెక్నాలజీ వైపు ఆకర్షితులవుతున్నారు.
5. మహాధన్ (రవితేజ కుమారుడు)
మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ కూడా నటనవైపు కాకుండా దర్శకత్వంవైపు అడుగులు వేస్తున్నాడు. దీనిలో భాగంగా మహాధన్ ప్రస్తుతం దర్శకత్వ విభాగంలో రాటుదేలుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘స్పిరిట్’ (Spirit) కోసం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కేవలం ఒకే దర్శకుడి వద్ద కాకుండా, అంతకుముందు సూర్య సినిమా కోసం దర్శకుడు వెంకీ అట్లూరి వద్ద కూడా ఆయన పనిచేశారు.
6. దియా (సూర్య జ్యోతికల కూతురు)
స్టార్ కపుల్ సూర్య-జ్యోతికల కుమార్తె దియా, తన సినీ ప్రయాణాన్ని అత్యంత వైవిధ్యంగా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరూ నటనవైపు వెళుతుంది అనుకుంటే దియా మాత్రం కెమెరా వెనుక ఉండి సమాజంలోని అట్టడుగు వర్గాల గాథలను వినిపించే ‘దర్శకత్వం’ వైపు మొగ్గు చూపింది. ఇందులో భాగంగానే మహిళా లైటింగ్ టెక్నీషియన్ల జీవితాల ఆధారంగా ఆమె ఒక ‘డాక్యూ-డ్రామా’ను రూపొందించి ప్రశంసలు కూడా అందుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

