Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!
Nani | ప్రస్తుతం సోషల్ మీడియాలో నేచురల్ స్టార్ నాని 'ఆయాషేర్' (Ayasher) మేనియా ప్రకంపనలు సృష్టిస్తోంది
Ayasher | ప్రస్తుతం సోషల్ మీడియాలో నేచురల్ స్టార్ నాని ‘ఆయాషేర్’ (Ayasher) మేనియా ప్రకంపనలు సృష్టిస్తోంది. తన రాబోయే చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ అటు టాలీవుడ్‌తో పాటు ఇటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో రికార్డులను తిరగరాస్తోంది. ఈ పాటలో నాని చూపించిన మాస్ ఎనర్జీ మరియు సిగ్నేచర్ స్టెప్పులు చూస్తుంటే, ఆయన గత పవర్ఫుల్ పాత్రల ప్రభావాన్ని కూడా ఇది మించిపోయిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి ‘ఔరా ఆఫ్ ఉస్తాద్’ పాట కూడా ఇటీవలే విడుదలైంది. మొదట్లో ఈ పాట ట్రెండింగ్‌లో నిలిచినప్పటికీ, నాని ‘ఆయాషేర్’ వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ‘ఆయాషేర్’ పాట ‘ఉస్తాద్’ను వెనక్కి నెట్టి మ్యూజిక్ సెక్షన్లో టాప్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో “ఆయాషేర్ దెబ్బకి ఉస్తాద్ ఔరా గల్లంతయింది” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ అదిరిపోయే సాహిత్యం అందించారు. ఇప్పటికే ఈ పాటపై వేల సంఖ్యలో రీల్స్ వస్తుండగా, సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ నాని మాస్ స్టెప్పులను అనుకరిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ పాట ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

