న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సైనికాధికారులు రచనలు చేయడంపై 20 ఏండ్ల పాటు ఆంక్షలు విధించే ప్రతిపాదనేదీ లేదని, ఇందుకు సంబంధించి క్యాబినెట్లో ప్రతిపాదనేదీ చర్చకు రాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం తెలిపారు. పదవీ విరమణ చేసిన తర్వాత 20 ఏండ్ల ్లపాటు సైనికాధికారులు పుస్తకాలు రచించడంపై ఆంక్షలేవీ లేవని, పదవీ విరమణ చేసిన వెంటనే పుస్తకాలు రచించడంపై మాజీ ప్రధాన సైనికాధికారులపై నిషేధం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
మాజీ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవణే రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి నుంచి ఈ వివరణ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనరల్ నరవణే పుస్తకంలో జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉన్న కారణంగా 2024లో విడుదల కావాల్సిన పుస్తకం రక్షణ శాఖ సమీక్ష పేరిట పెండింగ్లో ఉంది.