Ashleigh Gardner: ఆటతో పాటు వ్యక్తిగత జీవితంలో వివాదాలతోనూ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది అష్లే గార్డ్నర్ (Ashleigh Gardner). ఏడాదికే వివాహ బంధం ముగియడం, గార్డ్నర్ తనను చీట్ చేసిందని భార్య ఆరోపించడంతో మీడియాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ పేరు మార్మోగింది. ఈ నేపథ్యంలో గార్డ్నర్ తొలిసారి స్పందించింది. తాను కష్టమైన దశలో ఉన్నానని, తనకు ప్రైవసీ కావాలని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో అభ్యర్థించిందీ క్రికెటర్,
ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలకమైన అష్లీ గార్డ్నర్ వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదమైంది. నిరుడు భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో గార్డ్నర్ తనను చీట్ చేసిందని, మరో క్రికెటర్‌తో సన్నిహితంగా మెలిగిందని ఆమె భార్య మోనికా రైట్ (Monica Wright) ఆరోపించడమే అందుకు కారణం. వివాహ బంధం అర్ధాంతరంగా ముగియడం పట్ల తనపై మీడియాలో వస్తున్న కథనాలపై గార్డ్నర్ స్పందించింది.
Ash Gardner breaks silence after ex-wife Monica Wright calls for her leadership sacking 👇 #CricketTwitter pic.twitter.com/a9VlQ8IN4i
— Female Cricket (@imfemalecricket) August 13, 2026
‘నా భార్యతో విడిపోవడం అనేది వ్యక్తిగత విషయం. క్రికెట్ ఆస్ట్రేలియా నన్ను వైస్ కెప్టెన్ చేసినందున నా రిలేషన్షిప్ గురించి బహిరంగంగా చెప్పాల్సిన అవసరముంది. నాఉక మద్దుతుగా నిలిచి, బాధ్యతలు అప్పగించిన ఆసీస్ బోర్డుకు ధన్యవాదాలు. వచ్చే సీజన్లలో నేను గొప్ప ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలకం అవ్వాలనుకుంటున్నా. మోనిక, నేను కలిసి గడిపిన సమయానికి కృతజ్ఞురాలిని. కానీ, అదే బంధం చివరకు ఎంతో బాధకు కారణమైంది. ఈ పరిస్థితుల్లోనే తను సంతోషంగా ఉండాలని, విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా. ఈ అంశంపై నేను భవిష్యత్‌లో బహిరంగంగా కామెంట్లు చేయను. కాబట్టి.. నాకు ప్రైవసీ కావాలని మీ అందరికి తెలియజేస్తున్నా’ అని గార్డ్నర్ వెల్లడించింది.

మోనికా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న ఈ అఫైర్ విషయం డెయిలీ మెయిల్(Daily Mail) వార్థ సంస్థలో ప్రచురితమైంది. గార్డ్నర్ అఫైర్‌పై భగ్గుమన్న మోనికా.. ఆస్ట్రేలియా క్రికెటర్ జార్జియా వోల్(Georgia Voll) ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈవిడే మా కాపురాన్ని నాశనం చేసింది’ అని వెల్లడించింది. అన్యోన్యంగా ఉండే తమ మధ్య దూరం పెరగడానికి కారణం భారత పర్యటనే అంటోంది మోనికా.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ కోసం గార్డన్ర్తో పాటు ఆమె భార్య మోనికా కూడా వచ్చింది. అయితే.. టోర్నీ సమయంలోనే గార్డ్నర్ ప్రవర్తనలో తేడాను గమనించింది మోనిక. స్వదేశం వచ్చాక ఇదే విషయంపై తన భాగస్వామిని ఆమె ప్రశ్నించింది. అప్పుడు.. గార్డ్నర్ మన మధ్యలో ఏదో మార్పు వచ్చింది. ఇక కలిసి ఉండడం కుదరదు అని తేల్చి చెప్పింది. అక్కడితో వీరి పెళ్లి పెటాకులైంది.

నిరుడు నవంబర్లోనే ఆసీస్ ఆల్‌రౌండర్ సిడ్నీలో తాము కలిసి ఉంటున్న ఇంటిని వీడింది. వెళ్తూ వెళ్తూ తమ పెళ్లి ఉంగరాలను అక్కడే వదిలేసిందని డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన గార్డ్నర్, మోనికలు 2025 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది పూర్తికాగానే వీరి మధ్య మనస్పర్థలు.. పరాయి ఆకర్షణలు పెరగడంతో వీరి బంధం ముగిసింది.