MLA Pocharam Srinivas Reddy | రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా..? : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
MLA Pocharam srinivas reddy | రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. అందులో రహస్యమేం లేదు.. నా ప్రజల కోసం నా జీవితం.. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన. కార్యకర్త బాధలను తీర్చాలనేదే నా ఆలోచన అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
MLA Pocharam Srinivas Reddy | అనవసరంగా కాంగ్రెస్లో చేరాను.. 6 నెలల్లో బాన్సువాడలో పెండింగ్ సమస్యలు తీరుస్తానని రేవంత్ రెడ్డి చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నానంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ సమావేశంలో మరోసారి రేవంత్ గురించి పోచారం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. అందులో రహస్యమేం లేదు.. నా ప్రజల కోసం నా జీవితం.. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన. కార్యకర్త బాధలను తీర్చాలనేదే నా ఆలోచన. దాని కనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే.. నేను ప్రజల కోసం పార్టీ మారాను.. డబ్బుల కోసం కాదునాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు, నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. నాకు ఎలాంటి స్వార్థం లేదన్నారు పోచారం.
స్వార్థమనేది ఉంటే నేను రాజకీయం వదులుకుంటా.. కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయను. పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉత్తగనే కలిసిండా.. ఆయనకేదో స్వార్థం ఉందా.. అని రోజూ అంటరు. ఒకటి చెప్పండి ఏదైనా స్వార్థం ఉంటే నాకేమైనా డబ్బులు ఇచ్చిర్రా.. నేనేమైనా అమ్ముడుపోయిన్నా. అదే విషయం తెలియడానికి మాట్లాడినా.. వాస్తవం చెప్పాలంటే ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చిర్రు. చెప్పాల్సి వస్తది.. అన్నంపెట్టినోడిని మరుస్తమా..? ఈ ఫంక్షన్ హాల్ కేసీఆర్ వల్ల వచ్చింది.. చెప్పొద్దా..? నా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. అంటూ చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. తప్పేముంది!
నేను ప్రజల కోసం పార్టీ మారాను.. డబ్బుల కోసం కాదు
నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు, నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. నాకు ఎలాంటి స్వార్థం లేదు
నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు
ప్రజల కోసమే నా జీవితం..… https://t.co/FkdSutWnsg pic.twitter.com/Pkeep734dg
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
Read Also :
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

