Union Govt | ఫాస్ట్ రైడ్ కోసం టిప్ వసూలు చేయొద్దు.. రైడ్ హెయిలింగ్ యాప్‌లకు కేంద్రం ఆదేశాలు
Union Govt | ఉబర్, ఓలా, ర్యాపిడో (Uber, Ola, Rapido) లాంటి రైడ్ హెయిలింగ్ యాప్స్ (Ride Hailing App) లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అవసరం తప్పింది. ఈ ఒరవడికి చెక్ పెడుతూ కేంద్రం (Union Govt) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ప్రీ రైడ్ టిప్స్ ఆప్షన్ (Pre Ride Tip aption) ను తక్షణం తొలగించాలని రైడ్ హెయిలింగ్ యాప్స్‌కు కేంద్రం స్పష్టంచేసింది.
Union Govt : ఉబర్, ఓలా, ర్యాపిడో (Uber, Ola, Rapido) లాంటి రైడ్ హెయిలింగ్ యాప్స్ (Ride Hailing App) లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అవసరం తప్పింది. ఈ ఒరవడికి చెక్ పెడుతూ కేంద్రం (Union Govt) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ప్రీ రైడ్ టిప్స్ ఆప్షన్ (Pre Ride Tip aption) ను తక్షణం తొలగించాలని రైడ్ హెయిలింగ్ యాప్స్‌కు కేంద్రం స్పష్టంచేసింది. ప్రీ రైడ్ టిప్స్‌తో త్వరగా రైడర్ వచ్చే అవకాశం ఉందన్న భావన కలిగించి ప్రయాణికుల నుంచి అదనపు డబ్బు తీసుకోరాదని కేంద్రం ఆదేశించింది.
మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న అడ్వాన్స్ టిప్, చూజ్ యాన్ యాడాన్, క్వికర్ రైడ్ కన్ఫర్మేషన్ వంటి ప్రీరైడ్ టిప్ ఆప్షన్స్‌ను తొలగించాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రీరైడ్ టిప్ ఇస్తే డ్రైవర్ తమ అభ్యర్థనను త్వరగా ఆమోదిస్తారన్న భావన యూజర్లలో కలుగుతున్నదని పేర్కొన్నది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ప్యాసింజర్లు స్వచ్ఛందంగా, అదీ ప్రయాణం ముగిసిన తరువాతే టిప్ చెల్లించాలి. త్వరగా క్యాబ్ బుకింగ్ జరుగుతుందన్న భావనతో టిప్స్ ముందస్తుగా చెల్లించే పరిస్థితి ఉండకూడదు.
ఇక ప్యాసింజర్ టిప్ మొత్తం డ్రైవర్‌కే బదిలీ చేయాలి. ఓలా, ఉబర్ వంటి వాహన అగ్రిగేటర్లు ఇందులో ఎలాంటి వాటా స్వీకరించకూడదు. గతంలో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీచేసింది. త్వరగా రైడ్ బుక్ అవుతుందన్న భావన కలిగించి ప్రయాణికుల నుంచి ముందస్తుగా టిప్స్ వసూలు చేయొద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ తీరుకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

