కన్నాయిగూడెం, ఫిబ్రవరి 22 : సీఎం రేవంత్ సాక్షిగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మోటర్లు బంద్ అయ్యాయి. శనివారం వరకు ఆరు మోటర్లు పనిచేస్తున్నాయని చెప్పిన నీటిపారుదల శాఖ అధికారులు, తీరా సీఎం పర్యటిస్తున్న రోజే మోటర్లన్నీ బందయ్యాయి.
సీఎం సమీక్ష సందర్భంగా శబ్దం వినిపిస్తుందని మోటర్లను బంద్ చేశామని చెప్పినప్పటికీ.. అవి అసలు పనిచేస్తున్నాయా? లేవా? అనే అనుమానం కలుగుతున్నది. సమ్మక్క బరాజ్ నుంచి గోదావరి జలాలను ఏపీకి తరలిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆదివారం గేట్లను మూసివేసి ఆ ఆరోపణ అబద్ధమని చెప్పే ప్రయత్నం సర్కార్ చేసింది. నీళ్లు ఆంధ్రాకు వెళ్లడం లేదని నిరూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ గేట్లను మూసివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.