నిరుద్యోగులతో సర్కార్ వ్యాపారం.. ఉద్యోగ పరీక్షలకు భారీగా ఫీజు వసూళ్లా!
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్.. ఉద్యోగ పరీక్షల దరఖాస్తు ఫీజుల పేరిట నిరుద్యోగ యువతతో వ్యాపారం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సై పోస్టుకు రూ.1,500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1,000 దరఖాస్తు ఫీజులను వసూలు చేస్తూ నిరుద్యోగులను దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు.
- ఉద్యోగార్థులకు ఉచిత దరఖాస్తు అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఎగవేత
- వయోపరిమితి పెంచాలి.. ఫీజు తగ్గించాలి
- బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
హైదరాబాద్,ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్.. ఉద్యోగ పరీక్షల దరఖాస్తు ఫీజుల పేరిట నిరుద్యోగ యువతతో వ్యాపారం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సై పోస్టుకు రూ.1,500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1,000 దరఖాస్తు ఫీజులను వసూలు చేస్తూ నిరుద్యోగులను దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. అధికారంలోకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఎలాంటి దరఖాస్తు ఫీజులు వసూలు చేయబోమని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల నోటిఫికేషన్లలో కోతలు తెచ్చి రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 13 వేల ఉద్యోగాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఒకవైపు తెలంగాణ డీజీపీ రాష్ట్రంలో ఏకంగా 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారని గుర్తుచేశారు. అన్ని ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 7 వేల పోలీస్ ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
లాంగ్‌జంప్ నిబంధన ఎత్తివేయాలి
నియమాక శారీరక పరీక్షలో లాంగ్‌జంప్ విషయంలో కొత్తగా తెచ్చిన నిబంధనలను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని సుధీర్‌రెడ్డి కోరారు. లాంగ్‌జంప్ విషయంలో గతంలో గాంధీభవన్‌లో ధర్నాలు చేసిన నాయకులే నేడు అధికారంలోకి వచ్చారని, అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లాంగ్‌జంప్ 4 మీటర్లు కాకుండా 3 మీటర్ల 4 అంగుళాలకు పరిమితం చేయాలని గాంధీభవన్ ముందు ధర్నా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
వయోపరిమితి పెంచాలి
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేసిందని, కానీ అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించిందని సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్లలో గతంలో ఉన్న వయో పరిమితి ప్రకారమే పేర్కొన్నదని విమర్శించారు. పోలీస్ అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ నోటిఫికేషన్లను సవరించాలని డిమాండ్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. పాత జిల్లాల ప్రాతిపదికనే హైదరాబాద్ కొత్త కమిషనరేట్ల పరిధిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

