Bushra Bano: ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో వీడియోపై వివాదం.. బదిలీ ఆదేశాలు జారీ
Bushra Bano: ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో బదిలీ అయ్యారు. ఖరగ్‌పూర్ ఏఎస్సీ నుంచి స్టేట్ పోలీసు శాఖకు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఇటీవల బుష్రా బానో రిలీజ్ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
కోల్‌కతా: ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్న ఐపీఎల్ బుష్రా బానో(Bushra Bano)ను బదిలీ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల బుష్రా ఓ వీడియోను తన ఎక్స్‌లో పోస్టు చేశారు. సివిల్ సర్వీసెస్‌కు ఎలా వచ్చానన్న కోణంలో ఆమె తన జర్నీ గురించి వీడియోలో పేర్కొన్నారు. అయితే తన ప్రసంగంలో అసలామాలేకుం, ఇషా అల్లా అంటూ ఉర్దూ భాషలో గ్రీటింగ్స్ తెలిపింది. సౌదీ అరేబియా నుంచి వచ్చి ఐపీఎస్ ర్యాంకు ఎలా సాధించానన్న విషయాన్ని ఆమె తన వీడియోలో పేర్కొన్నది. ఇక ఆ వీడియోను ఆమె జాజకల్లా అంటూ ఉర్దూ పదంతో సైనాఫ్ చేసింది. అయితే ప్రభుత్వ అధికారిక హోదాలో ఉన్న వ్యక్తి.. ఆ భాష వాడడం సరికాదు అని హిందూ లీగల్ ఫండ్ అనే సంస్థ ఫిర్యాదు చేసింది. వందేమాతం అని కానీ, జై హింద్ అని కానీ తన వీడియో సందేశంలో బుష్రా పేర్కొనలేదని కూడా ఫిర్యాదులో తెలిపారు.
యూపీలోని కన్నౌజ్ జిల్లాలో పుట్టిన బుష్రా.. అలీఘడ్ ముస్సిం వర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీహెచ్డీ పూర్తి చేసింది. రీసర్చ్ ఫెలోషిప్ జాతీయ పరీక్షలోనూ పాసైంది. కానీ పెళ్లి, పిల్లల వల్ల ఆమె కొన్నాళ్లు సౌదీ అరేబియలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చి యూపీఎస్సీ ప్రిపేరైంది. అలీఘడ్ వర్సిటీలోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ తనకు స్టడీ మెటీరియల్ ఇచ్చినట్లు చెప్పిందామె. 2018లో బానో యూపీఎస్సీ పరీక్ష క్లియరైంది. ఆ ఏడాది ఆమెకు 277 ర్యాంక్ వచ్చింది. రైల్వే సర్వీస్‌లో ఆమెకు కేటాయించారు. కానీ ప్రెగ్నెంట్ కావడం వల్ల ఆ ఆఫర్ వదులుకున్నది.
ఆ తర్వాత ఏడాది కూడా యూపీఎస్సీ పరీక్ష రాసి 234 ర్యాంక్ సాధించింది. ఈసారి ఆమెకు ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. 2021లో బెంగాల్ క్యాడర్ ఆఫీసర్ అయ్యిందామె. తొలి పోస్టింగ్‌లో హూగ్లీ రూరల్ ఏఎస్పీగా చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఖరగ్‌పూర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుతం ఆమెను స్టేట్ పోలీసు శాఖకు ట్రాన్స్ఫర్ చేశారు.
Complaint filed with West Bengal Home Secretary regarding IPS Bushra Bano’s official video statement.
She began with Assalamualaikum, used Inshallah, ended with Jazakallah — and did not use Vande Mataram or Jai Hind.
A serving officer representing the Indian state should…— Hindu Legal Fund (@HinduLegalFund) September 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

