AP Jobs | ఏపీలో 1156 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
AP Jobs | ఇంటర్ పూర్తి చేసి, ఖాకీ కొలువుల కోసం ఎదురుచూసేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది.
AP Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (SLPRB AP) 1156 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్), ఫైర్‌మెన్, వార్డర్ పోస్టులను నింపనుంది. ఇంటర్ ఉత్తీర్ణులై, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
పోలీస్ డిపార్ట్మెంట్లో స్టైపెండరీ క్యాడెట్ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) (పురుషులు, మహిళలు)- 542
పోలీస్ డిపార్ట్మెంట్లో SCT కానిస్టేబుల్ (ఏఆర్) (పురుఫులు, మహిళలు)- 285
డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఫైర్‌మెన్- 158
ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో వార్డర్లు (పురుషులు)- 150
ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో వార్డర్లు (మహిళలు)- 21
పై పోస్టుల్లో ఈ 1156 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Posts
అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఈ ఏడాది జూలై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు పదో తరగతి పాసై, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదివి పరీక్షలకు హాజరై ఉండాలి. వీటితో పాటు నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.
వయసు
ఈ ఏడాది జూలై 1 నాటికి కానిస్టేబుల్, సివిల్, ఏఆర్‌లకు 18 నుంచి 24 ఏండ్లలోపు ఉండాలి. మిగతా పోస్టులకు 18 నుంచి 32 ఏండ్లలోపు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు 5 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎక్స్‌సర్వీస్‌మెన్, ప్రభుత్వ ఉద్యోగులు, వితంతువులకు నిర్దేశించిన సడలింపులు ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు పూర్తి చేయాలి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన తరువాత స్టేజ్-II దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ. 300. ఎస్టీ, ఎస్టీలకు రూ. 150.

Apply
ఎంపిక
ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య ప్రమాణాల పరీక్ష (Physical Measurement Test ), మెయిన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ (200 మార్కులు), మెయిన్స్ (200 మార్కులు)లో ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, కల్చర్, నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
Physical Measurements పోస్టును బట్టి ఉఉన్నాయి.
ఎంపికైనవారికి నెలకు జీతం రూ. 25,220 – రూ. 80,910 ఉంటుంది.
దరఖాస్తు తేదీలు ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థులు వెబ్సైట్ https://slprb.ap.gov.inను పరిశీలిస్తూ ఉండాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

