medical stores | ఇకపై మెడికల్ స్టోర్లలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి.. కేంద్ర ప్రతిపాదన.. ఎందుకంటే
medical stores : దేశంలోని మెడికల్ స్టోర్లలో ఇకపై సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన చేసింది.
medical stores : దేశంలోని మెడికల్ స్టోర్లలో ఇకపై సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన చేసింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న డ్రగ్స్ రూల్స్, 1945 చట్టంలోని రూల్ 65కు సవరణలు చేయాలని ప్రతిపాదించింది. సెప్టెంబర్ 8న దీనిపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మాత్రమే అమ్మేలా చూడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రాసే ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ మాత్రమే అమ్మేలా పర్యవేక్షించే వీలుంటుంది. డ్రగ్స్ విక్రయ చట్టం బలంగా అమలవుతుంది. డ్రగ్స్ (అమెండ్మెంట్) రూల్స్, 2026, సబ్ రూల్ 2ఏ పేరుతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పటికే ఉన్న రూల్ 65, సబ్ రూల్ 2 తర్వాత దీన్ని ప్రతిపాదించారు. హోల్‌సేల్ సరఫరా కాకుండా ఇతర ఏ డ్రగ్స్ అయినా సరఫరా, రవాణా వంటివన్నీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే సాగాలి.
అందుకోసం తప్పనిసరిగా సీసీటీవీ నిఘా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోంది. మెడికల్ స్టోర్లలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియోలను కనీసం మూడు నెలలపాటు నిల్వ చేయాలి. ఇదే సమయంలో ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రూల్స్‌పై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియజేయవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

