సిమ్లా: కారు, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణించిన మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ధ్వంసమైన కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంతో బయటకు తీశారు. (Car Collides With Tipper Truck) హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం అర్ధరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు సంతోఖ్‌గఢ్ నుంచి తహ్లివాల్కు కారులో ప్రయాణించారు. ఒక పెట్రోల్ బంకు సమీపంలో కారు, వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొన్నాయి.
కాగా, ప్రమాదం ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ కారు రెండు ముక్కలైంది. పెద్ద శబ్దం విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. కారు ప్రమాదం గురించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. కారులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల మృతదేహలను అతి కష్టంతో బయటకు తీశారు.
మరోవైపు మృతులను మెహత్పూర్కు చెందిన 22 ఏళ్ల తరంజిత్ సింగ్, 20 ఏళ్ల మయాంక్, మహిళను కిరణ్ దేవిగా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగం, రాత్రివేళ తక్కువ లైటింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పరారైన టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
School Boy Dies By Suicide | ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక.. స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
2 brides in a month | ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి.. అరెస్ట్ చేయించిన భార్యలు
Watch: కొత్తగా కొనుగోలు చేసిన థార్‌లో సమస్యలు.. షోరూమ్‌కు లాక్కెళ్లిన గాడిదలు