Donald Trump : అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ లయన్స్ రోర్’ విజయవంతమైందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. తమ విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారని ఆయన తెలిపారు. తమ సైనిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 48 మంది నాయకులు హతమయ్యారని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఖమేనీ సహా పలువురు కీలక నేతలను అంతమొందించామని ఆదివారం ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయేల్ ఆ దేశంలోని ప్రధాన నాయకులను అంతం చేస్తున్నాయి. మతాధికారి, ప్రముఖ రాజకీయ నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందగా.. అణు శాస్త్రవేత్తలు, రక్షణ శాఖ అధికారులు.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో ఆదివారం మాట్లాడుతూ.. తాము ఇరాన్‌పై గెలిచామని అన్నారు.
US President Donald Trump tells CNBC that US military actions against Iran are “ahead of schedule”, while US military says three service members killed, first known American casualties from conflict. Jon Brain has more pic.twitter.com/788Kq4XO38
— TRT World (@trtworld) March 1, 2026
‘మేము సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరు. ఒకేఒక షాట్లో ఇరాన్‌లోని 48 మంది ప్రధాన నాయకులు మరణించారు. ఇంకా మా సైనిక దాడులను ఉదృతం చేస్తున్నాం. మేము అనుకున్న షెడ్యూల్ కంటే వేగంగా.. మరింత చురుకుగా ఇరాక్‌లో అమెరికా సైన్యాలు కదులుతున్నాయి’ అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో తెలిపారు. అంతేకాదు ఇరాన్‌లోని కొత్త నాయకత్వం ఇప్పటికే వాషింగ్టన్ డీసీతో చర్చలు జరపడం మొదలెట్టిందని, వారితో చర్చలకు తాను ఆమోదం తెలిపానని ఆయన అట్లాంటిక్ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఇరాన్లో హింసాత్మక పాలనను అంతమొందించడానికే దాడులు చేస్తున్నామని.. ఇది మాకోసం కాదని.. ప్రపంచం కోసమని ట్రంప్ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే.