Jharkhand student activist | జార్ఖండ్ విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష.. వాంగ్చుక్ అభ్యర్థన మేరకు నీరు తాగిన స్టూడెంట్ లీడర్
Jharkhand student activist | జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ), ఇతర పోటీ పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో, మరో ఐదుగురు విద్యార్థులు జూలై 3 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
రాంచి: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ), ఇతర పోటీ పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో, మరో ఐదుగురు విద్యార్థులు జూలై 3 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. (Jharkhand student activist) సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, జార్ఖండ్ విద్యార్థుల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. స్టూడెంట్ లీడర్ దేవేంద్రతో బుధవారం వీడియో కాల్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం మంచి నీరైనా తాగాలని సూచించారు. దీంతో వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు దేవేంద్ర నీరు తాగారు.
కాగా, నీరు తాగినంత మాత్రాన తన నిరసన ముగిసినట్లు కాదని దేవేంద్ర మహతో స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని, ఆహారం తీసుకోబోనని చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు తమ నిరసనను తీవ్రం చేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల అవకతవకలపై సీబీఐ లేదా రాష్ట్రం వెలుపలికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన స్వతంత్ర కమిటీ ద్వారా విచారణ జరుపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
रांची में चल रहें छात्रों के प्रदर्शन में देवेंद्र नाथ महतो भूख हड़ताल पर बैठे हैं, सोनम वांगचुक ने इनसे बात की जिसके बाद इन्होंने पानी पीया।
इन्हें झारखण्ड का सोनम वांगचुक कहा जाता हैं।
Sonam Wangchuk #JPSC #jharkhand #DevendrNathMahto pic.twitter.com/QDnWe6Rewq
— Raman Rai (@journal_raman) August 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

