Delimitation Bill | ఈ నెలలోనే డీలిమిటేషన్ బిల్.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్న కేంద్రం
Delimitation Bill : కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లులపై ముందడుగు పడనుంది. ఈ రెండు బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఇందుకోసం ఈ వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
Delimitation Bill : కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లులపై ముందడుగు పడనుంది. ఈ రెండు బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఇందుకోసం ఈ వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆగష్టు 16 నుంచి 18 వరకు, మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మూడు రోజులు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై పార్లమెంట్లో చర్చిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13న ముగుస్తాయి.
అనంతరం మరో మూడు రోజుల్లోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, రెండు బిల్లులపై చర్చిస్తారు. ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. ఎందుకుంటే ఇవి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులు. ఈ బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం అన్ని పక్షాల్ని సంప్రదిస్తోంది. ఒకవేళ తగిన మెజారిటీ లభిస్తే ఈ బిల్లులు ఉభయసభల్లో పాస్ అవుతాయి. ఈ నేపథ్యంలో రెండు బిల్లుల గురించి చర్చించేందుకు కేంద్రం.. కాంగ్రెస్ పార్టీని సంప్రదించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ఉదయం పార్లమెంట్లో కలుసుకున్నారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లును తిరిగి ప్రవేశపెట్టడంపై రాహుల్ గాంధీకి వివరించారు. ఈ బిల్లులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ బిల్లులపై కాంగ్రెస్ అభిప్రాయం తెలుసుకున్నారు.
ఇదే సమయంలో ప్రస్తుతం పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభన గురించి కూడా మాట్లాడారు. తాము అమిత్ షా రాజీనామా కోరడం లేదని, విద్యార్థులపై జరిగిన దాడిపై ప్రకటన చేయాలని మాత్రమే కోరుతున్నామని రాహుల్.. కిరణ్ రిజిజుకు వివరించారు. రెండు బిల్లలుపై చర్చించేందుకు రాహుల్ నిరాకరించినట్లు సమాచారం. రాహుల్తోపాటు పార్లమెంట్లో కీలక పార్టీలైన సమాజ్వాదీ పార్టీ నేతలను కూడా కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. ఇతర పార్టీల నాయకుల్ని కలిసి బిల్లులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతోంది బీజేపీ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

