– అధ్యక్షుడిగా ఆడెపు పరమేష్, ప్రధాన కార్యదర్శిగా వరికుప్పల సురేష్
చండూరు, సెప్టెంబర్ 16 : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) చండూరు మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన జయశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చండూరు మండల టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా ఆడెపు పరమేష్ (10 టీవీ), ప్రధాన కార్యదర్శిగా వరికుప్పల సురేష్ (నమస్తే తెలంగాణ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా, ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన ఏకైక సంఘం టియుడబ్ల్యూజే 143 అన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండస్థలాల కోసం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ హాజరయ్యారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు గోలి విజయకుమార్, నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలింక గురుపాదం, టీయూడబ్ల్యూజే నల్లగొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జానయ్య, టీయూడబ్ల్యూజే నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు పోలగోని లక్ష్మీకాంత్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డు సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కోడి రాములు, చండూరు మండలం టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు బోయపల్లి రమేష్ గౌడ్, చండూరు ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు వంగూరి నగేష్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.