Harish Rao | నీ కుంభకోణాలన్నీ బయటకొస్తాయని సభ నుంచి సస్పెండ్ చేసింది నువ్వు కాదా రేవంత్..? : హరీశ్ రావు
Harish Rao | నీ ఆరు గ్యారంటీల అమలులో నువ్వు విఫలం అని రాసింది నిజం కాదా..? అవ్వాతాతలు రూ.4 వేలు ఎగ్గొట్టింది నిజం.. మహిళలకు రూ.2500 ఎగ్గొట్టింది నిజమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు..
Harish Rao | ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేక రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాకు దిగుతున్నారని ఇవాళ అసెంబ్లీ మీటింగ్ చూసిన ప్రతీ ఒక్కరికీ స్పష్టంగా అర్థమవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం రేవంత్ రెడ్డి అబద్దాలు, అర్థ సత్యాలు చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ఆరోపించారు. ఆయన మాట్లాడినవన్నీ కూడా పచ్చి అబద్దాలు.. మా రాహుల్ గాంధీ టీ షర్ట్, స్టిక్కర్లు వేసుకొని లోక్ సభకు పోయారు. లోక్ సభ నియమ నిబంధనలువేరు.. అసెంబ్లీ నియమ నిబంధనలు వేరు. అంటే మీ రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు టీ షర్ట్ వేసుకొని పోతే ఒప్పు.. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ షర్ట్ వేసుకొని అసెంబ్లీకి వస్తే తప్పు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
కొన్ని రూల్స్ ఉంటాయి.. రాజ్యాంగం ఉంటది.. కొన్ని సంప్రదాయాలు ఉంటాయంటడు. అసలు అసెంబ్లీలు ఏ సంప్రదాయాలు పాటిస్తాయి.. లోక్ సభలో పాటించే సంప్రదాయాలే సాధారణంగా అసెంబ్లీలు కూడా పాటిస్తుంటాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ టీ షర్ట్లు, స్టిక్కర్లు వేసుకోవచ్చని రాహుల్ గాంధీ రేవంత్‌రెడ్డిని సమర్థిస్తడు. బీఆర్ఎస్ వేస్తే తప్పు.. బీఆర్ఎస్ ఏమైనా టీ షర్ట్ మీద బూతు పదం రాసుకొని వచ్చిందా..? ఏమైనా నిషేధించిన పదాలు రాసుకొచ్చిందా అని ప్రశ్నించారు.
నీ ఆరు గ్యారంటీల అమలులో నువ్వు విఫలం అని రాసింది నిజం కాదా..? అవ్వాతాతలు రూ.4 వేలు ఎగ్గొట్టింది నిజం.. మహిళలకు రూ.2500 ఎగ్గొట్టింది నిజం. విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వంది నిజం అని రాసుకొస్తే అదేదో బూతు పదం,నిషేధితపదమని మమ్మల్ని సస్పెండ్ చేసినవ్. వీళ్లు కావాలనే అసెంబ్లీ నుంచి పోయిర్రు అని రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతడు.. మేం పోలేదు అసెంబ్లీ నుంచి.. పథకం ప్రకారం నువ్వు పంపించినవ్.. మా సోదరీమణులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గొంగు పిసికారు.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారు.. దాని మీద ఎంక్వైరీ చేయండి.. క్షమాపణ చెప్పండి.. లేదా మాట్లాడటానికి మైక్ ఇవ్వండి సబితక్కకు అని 10 సార్లు స్పీకర్‌ను అడిగాం. నిండు శాసనసభ సాక్షిగా గేటు ముందే మహిళా ఎమ్మెల్యేల మీద హత్యాయత్నం జరుగుతుంటే మైకు కూడా ఇవ్వలేదన్నారు.
మేం సభలో ఉంటే మీ బండారాన్ని బయటపెడతామని.. మీ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయని, నీ తమ్ముడి కుంభకోణాలు బయటపెడతామని, నీ కుటుంబ కుంభకోణాలన్నీ బయటకొస్తాయని సభ నుంచి సస్పెండ్ చేసింది నువ్వు కదా..? అని ప్రశ్నించారు. సస్పెండ్ చేస్తే ఒక్క రోజు చేయొచ్చు కదా.. మొత్తం సెషన్‌కు ఎందుకు చేసినవ్ అని ప్రశ్నించారు.
LIVE: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశంhttps://t.co/5AWGNGUZrR
— BRS Party (@BRSparty) September 16, 2026
Read Also :
‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’
TN CM Vijay | లండన్‌లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..!
Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

