ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
గుర్రంపోడు మండలం తానేదారిపల్లి రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాలియా వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, రసాయన ఎరువులు...
గుర్రంపోడు, సెప్టెంబర్ 16 : గుర్రంపోడు మండలం తానేదారిపల్లి రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాలియా వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం, సహజ పద్ధతులతో పంటలు సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు, పంటల నాణ్యతను పెంచుకోవచ్చని వివరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడు వ్యవసాయ అధికారి కంచర్ల మాధవ రెడ్డి, ఏఈఓ, తానేదారిపల్లి సర్పంచ్ కంచర్ల యాదమ్మ మధుసూదన్, జిన్నాయిచింత సర్పంచ్ వడ్లమల్ల పుష్పలత యాదయ్య, ఉప సర్పంచులు పాల్వాయి ఏడుకొండలు, కట్టేబోయిన వెంకటయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

