బూర్గంపహాడ్, సెప్టెంబర్ 16 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ ఐటీఐ కళాశాలలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు వివిధ పరిశ్రమల్లో అప్రెంటీస్ శిక్షణ చేయడానికి ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్ మేళా ఈ 18న ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. ఐటీఐ పాసైన అభ్యర్ధులు www.apprenticeshipindia.in లో పేరు నమోదు చేసుకుని నకలు కాపీ, ఒక బయోడేటా ఫారంను, విద్యార్హత ధృవీకరణ పత్రాలు జతచేసి అప్రెంటీస్ మేళాకు హాజరుకావాలని కోరారు. ఈ అప్రెంటీస్ మేళాలో ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం, ఫిమాకేం ఇండియా లిమిటెడ్ లక్ష్మీపురం, మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ జహీరాబాద్, మేఆ సర్వో డ్రైవ్ హైదరాబాద్, డైనమిక్ టూల్స్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీలు హాజరుకానున్నాయని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.