WI vs IND : చావోరేవో మ్యాచ్‌లో సంజూ శాంసన్ (55 నాటౌట్ )క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు పడినా జోరు తగ్గించని సంజూ.. అర్ధ శతకం బాదేశాడు. రొమారియో షెపర్డ్ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతడు.. మోతీ ఓవర్ల కట్ షాట్ బౌండరీతో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ చిచ్చరపిడుగు విధ్వంసక ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
పొట్టి ప్రపంచకప్‌లో లీగ్ దశలో బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్ నాకౌట్లో చెలరేగిపోతున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మకు జతగా ఇన్నింగ్స్ ఆరంభిస్తూ.. శుభారంభాలు ఇస్తున్నాడీ హిట్టర్. చెపాక్ స్టేడియంలో జింబాబ్వేపై పరుగులతో రాణించిన సంజూ.. ఈడెన్ గార్డెన్స్‌లో చెలరేగిపోయాడు. వెస్టిండీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న అతడు.. తన సొగసైన ఆటతో అలరిస్తూ.. 26 బంతుల్లో అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు.
Big match impact 👊
A fluent 2⃣6⃣-ball FIFTY for Sanju Samson in the chase 🫡#TeamIndia need 98 runs from 60 deliveries.
Updates ▶️ https://t.co/ur4pr8Bi3K#T20WorldCup | #MenInBlue | #INDvWI | @IamSanjuSamson pic.twitter.com/SZ0E1NRxHZ
— BCCI (@BCCI) March 1, 2026