WI vs IND : ప్రపంచకప్‌లో వరుసగా నిరాశపరుస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ(10) మళ్లీ విఫలమయ్యాడు. జింబాబ్వేపై అర్ధ శతకంతో ఫామ్ అందుకున్నట్టే కనిపించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. వెస్టిండీస్‌పై సులువగా వికెట్ ఇచ్చేశాడు. అకీల్ హొసేన్ ఓవర్లో బ్యాక్‌ఫుట్‌లో బంతిని బౌండరీ తరలించాలనుకున్న అభిషేక్ అంచనా తప్పాడు. ఇంకేముంది గాల్లోకి లేచిన బంతిని హిట్మైర్ ఒడుపుగా అందుకున్నాడు. కాసేపటికే హోల్డర్ ఓవర్లో ఫోర్‌తో అలరించిన ఇషాన్ కిషన్(10) సైతం బౌండరీ లైన్ వద్ద హిట్‌మైర్‌కు చిక్కాడు. దాంతో.. 41 వద్ద భారత్ రెండో వికెట్ పడింది.
వెస్టిండీస్ నిర్దేశించిన భారీ ఛేదనలో భారత పవర్ ప్లేలోనే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లోకి వచ్చినట్టే అనిపించిన అభిషేక్ శర్మ(10) పేలవ షాట్‌తో పెవిలియన్ చేరాడు. అకీల్ హొసేన్ వేసిన తొలి ఓవర్లో ఏమాత్రం తొందరపడని అభిషేక్.. చివరకు అతడి ఉచ్చులో పడ్డాడు.
Fifty in the previous game to end a rut, but Abhishek Sharma falls here for a 11-ball 10
LIVE 👉 https://t.co/nAvSMDluyM pic.twitter.com/AqG4Jq2uFe
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2026
అంతకుముందు సంజూ శాంసన్(24) లెగ్ సైడ్ రెండు భారీ సిక్సర్లు.. సంధించాడు. అభిషేక్ సైతం పెద్ద షాట్‌కు యత్నించి.. హిట్మైర్ చేతికి దొరికాడు. ఆ తర్వాత వస్తూనే రెండు ఫోర్లతో అలరించిన ఇషాన్ కిషన్(10)ను హోల్డర్ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం సంజూకి జతగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(3) ఆడుతున్నాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో శాంసన్ బౌండరీతో స్కోర్ 50 దాటింది. 6 ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోర్.. 53-2 .