రాయపోల్, మార్చి 01 : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధనలో అమరులైన మాదిగ బిడ్డలకు రాయపోల్ మండల కేంద్రంలో నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మాదిగ అమరులను స్మరించుకున్నారు.
ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డలను, మాదిగ అమరవీరులను ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర నర్సింలు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం, నర్సింలు మాదిగ, రాయపోల్ సర్పంచ్ రాజు మాదిగ, కళాకారుడు స్వామి మాదిగ, కోశాధికారి లక్ష్మణ్ మాదిగ, కొత్తపల్లి స్వామి మాదిగ, వడ్డేపల్లి రవి మాదిగ, తదితరులు పాల్గొన్నారు.