నాపైనే కుల వివక్ష!
ఈనెల 8న ఉత్తరాఖండ్ హల్దానీలోని రామ్‌లీల గ్రౌండ్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశం అపవిత్రమై పోయిందంటూ బీజేపీ అనుబంధ వర్గాలు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.
- అంటరానితనం బాధను అనుభవంలోకి తెచ్చారు
- రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఆవేదన
- ఖర్గే ప్రసంగించిన చోట శుద్ధీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఈనెల 8న ఉత్తరాఖండ్ హల్దానీలోని రామ్‌లీల గ్రౌండ్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశం అపవిత్రమై పోయిందంటూ బీజేపీ అనుబంధ వర్గాలు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఇది కాంగ్రెస్, బీజేపీల పరస్పర విమర్శలకు దారితీసింది. ఖర్గే ప్రసంగించిన ప్రాంతంలో బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దీనిపై ఖర్గే గురువారం రాజ్యసభలో ఆవేదనతో ప్రసంగించారు.
హల్దానీలో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఒక అంటరానితనం తాలుకు చేదు అనుభవాన్ని తాను చవిచూడాల్సి వచ్చిందని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ‘దీనిని రాజకీయం చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. చాలా ఏండ్లుగా నేను పార్లమెంట్లో ఉన్నాను. ప్రస్తుతం రాజ్యసభలో, గతంలో దిగువ సభలో సభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడూ సానుభూతిని పొందడానికి ప్రయత్నించ లేదు. నాది షెడ్యూల్డ్ కులం, నేను దళితుడినని చెప్పి సహాయం, రక్షణ కల్పించాలని ఎన్నడూ అడుగ లేదు’ అని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు. ‘హల్దానీలో నేను ప్రసంగించినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. నేను ఏ కులం, మతం పేరునూ ప్రస్తావించ లేదు. ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావించా. కానీ నా ప్రసంగం పూర్తయిన తర్వాత మీరు (బీజేపీ అనుబంధ సభ్యులు) శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను అవమానించడానికి ప్రయత్నించారు. అస్పృశ్యత తాలుకు బాధను మీరు అనుభవం లోకి తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి? రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షిస్తారు. నేను ప్రతిపక్ష నాయకుడిని. పోరాటం చేసే శక్తి ఉంది. పోరాడుతాను.’ అని పేర్కొన్నారు. వేదికను శుద్ధి చేసిన వారిపై అంటరానితనం చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అలాంటి చర్యలను బీజేపీ ఎంతమాత్రం ప్రోత్సహించదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామని ఆయన హామీనిచ్చారు.
స్థలం పవిత్రతను ఉల్లంఘించారు
సభాస్థలి శుద్ధి జరిగిన విషయాన్ని నిర్వాహకులు అంగీకరించారు. అక్కడో రాజకీయ సభ జరిగిందని, సభా నిర్వాహకులు చేసిన కొన్ని అభ్యంతరకర నినాదాలు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదన్న లక్ష్యంతోనే అక్కడ శుద్ధీకరణ చేసినట్టు ఆ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు. ఘటనపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేశ్ గొడియాల్ మాట్లాడుతూ బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆరోపించారు. ఈ ఘటనను ఆర్జేడీ ఇతర పార్టీలు ఖండించాయి. ఈ దురదృష్టకర ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించాలని కాంగ్రెస్ నేత సల్మాన్ సోజ్ కోరారు.
మాకేం సంబంధం లేదు: బీజేపీ
శుద్ధి కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఖండించింది. ఘటనను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తున్నదని, ఇదొక విభజన వ్యూహమని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి ఖాజన్ దాస్ పేర్కొన్నారు. దళితులను తాము అవమానించ లేదని, అది మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

