రాయపోల్, మార్చి 01 : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధనలో అమరులైన మాదిగ బిడ్డలకు రాయపోల్ మండల కేంద్రంలో నివాళులు అర్పించారు. మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం మాదిగ అమరులను స్మరించుకున్నారు.
ఎస్సీ వర్గీకరణకోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులకు వర్గీకరణ విజయాన్ని అంకితం చేస్తూ ఈ 13న నివాళి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.