హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి మరణంతో మంచి మిత్రుడిని కోల్పోయానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో ఐదు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.5గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.