Srinivas Goud | ముసుగుల్లో వచ్చిన వారెవరు.. సైఫాబాద్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి.. శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
Srinivas Goud | సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో, పీఏపై దుండగుల దాడినిక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి దాడి చేయడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Srinivas Goud | సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో, పీఏపై దుండగుల దాడినిక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి దాడి చేయడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్‌లోనే ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించారన్న ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పండగ రోజున విచారణ కోసం కేటీఆర్ పీఆర్వో, పీఏను సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన సమయంలో సాయంత్రం సుమారు 6.30 గంటలకు దాదాపు 15 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి దాడికి యత్నించారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు వారిని గుర్తించి అడ్డుకోవడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.
పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగులు ధరించి వచ్చి దాడికి ప్రయత్నించాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. వారి వెనుక ఎవరున్నారు? వారికి ఎవరి మద్దతు ఉంది? అనే విషయాలను దర్యాప్తులో తేల్చాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసంఘాలు, ఉద్యమ నాయకులు, ప్రజాప్రతినిధులపై జరిగిన దాడులను ఈ ఘటన గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన సమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పూర్తి ఫుటేజ్‌ను ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని, అవసరమైన దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచాలని కోరారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.
హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని అన్నారు. ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరో గుర్తించి, ఘటన వెనుక ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Platelet Count | పిల్లల్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Farmers Self Declaration | ఎండితే మా ఖర్మే.. పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ సెల్ఫ్ డిక్లరేషన్
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
Chamala Kiran Kumar Reddy | కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలా.. కాంగ్రెస్ ఎంపీ చామల అజ్ఞానం బట్టబయలు
Tummidihatti | తమ్మిడిహట్టికి కేసీఆర్ విశ్వప్రయత్నం.. మెప్పించి, ఒప్పించేందుకు విశేష కృషి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

