గీతదాటితే సహించేది లేదు
పార్టీలో క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని, ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించే ప్రసక్తేలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గురువారం గాంధీభవన్‌లో ఆయన స్పందించారు. ‘రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం గమనిస్తున్నదని తెలిపారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అని, ఏ విషయానికైనా సమయం రావాలని వ్యాఖ్యానించారు.
- ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యవహారాన్ని అధిష్ఠానం గమనిస్తున్నది
- టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ) : పార్టీలో క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని, ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించే ప్రసక్తేలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గురువారం గాంధీభవన్‌లో ఆయన స్పందించారు. ‘రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం గమనిస్తున్నదని తెలిపారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అని, ఏ విషయానికైనా సమయం రావాలని వ్యాఖ్యానించారు. గతంలో కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకునే ముందు పలుసార్లు అవకాశం ఇచ్చామని గుర్తుచేశారు.
కొత్త పార్టీ ఇన్చార్జి సందీప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని అంశాలనూ పరిశీలిస్తారని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ దృష్టి సారించిందని వెల్లడించారు. నాగర్జునసాగర్ నుంచి నీటిని తరలించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని చెప్పా రు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖలు రాశామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని వెల్లడించారు. డ్యామ్‌పై కేంద్ర బలగాలు, కేఈఆర్ఎంబీ నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉన్నా బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే బదనాం చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

