రవీంద్రభారతి, ఫిబ్రవరి 28: మాదిగ అమరుల త్యాగాల పునాదుల మీద మందకృష్ణ మాదిగ భోగాలు అనుభవిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో అమరవీరుల కుటుంబ సభ్యులు ములుగు అంజయ్య, ఇందిరమ్మ, నడిమింటి కావేరి, పొన్నాల యాదమ్మతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని 30 ఏండ్లపాటు సజీవంగా నిలిపింది, త్యాగాలు చేసింది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలేనని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమరుల త్యాగఫలితమేనని స్పష్టం చేశారు.
మతతత్వ బీజేపీతో కుమ్మక్కైన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాల్లో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని, 19న రాజకీయాలకు అతీతంగా సంస్మరణ సభను నిర్వహించనున్నట్టు వంగపల్లి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, రూ.50 లక్షల ఆర్థికసాయం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి అమరుల కుటుంబాలను ఆదుకోవాలని, అమరుల స్మారక స్థూపం నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతలు రమేశ్, చాపకృష్ణ, కొల్లూరి వెంకటేశ్, యాదన్న, శాంతికిరణ్, నవీన్‌కుమార్, నాగరాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.