వర్షాకాల సమావేశాలకు తెర!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గురువారం తెరపడింది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల కాల్పులు, అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విరసనలు వెల్లువెత్తడంతో వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
- లోక్సభ నిరవధిక వాయిదా
- చర్చ లేకుండా 10 బిల్లులు పాస్
- చివరి రోజు మోదీ, షా హాజరు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గురువారం తెరపడింది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల కాల్పులు, అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విరసనలు వెల్లువెత్తడంతో వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే పలు కీలక బిల్లుల ఆమోదం పొందగా సమావేశాల ప్రారంభం నుంచి సభలో కనిపించని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా చివరి రోజు లోక్సభలో ప్రత్యక్షమయ్యారు.
గురువారం ఉభయ సభలు సమావేశం కాగానే వందేమాతరంలోని ఆరు చరణాలు వినిపించారు. పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాల కాలంలో సభ పనితీరు ప్రస్తావిస్తూ ఇచ్చే సాధారణ ముగింపు ప్రసంగాన్ని బిర్లా చదివి వినిపించలేదు.
చర్చలో పాల్గొనాలని బిర్లా విపక్ష సభ్యులను పదేపదే కోరినప్పటికీ ప్రతిపక్షం తమ నిరసనలను కొనసాగించడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. గురువారం కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాల్లో నీట్ పశ్న పత్రం లీక్ వ్యవహారం, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
12 బిల్లులు ఆమోదం
రాజ్యసభ ఆమోదించిన రెండు బిల్లులు సహా మొత్తం 12 బిల్లులు ఈసారి సమావేశాల్లో ఆమోదం పొందాయి. దీంట్లో 10 బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందటం గమనార్హం. రాష్ర్టాల అధికారాలను పరిమితం చేస్తూ గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2026ను రాజ్యసభ గురువారం ఆమోదించింది.
పాలక-విపక్ష సభ్యుల ముఖాముఖీ
జార్ఖండ్లో యువతపై పోలీసుల చర్య, అయోధ్యలోని రామ మందిరానికి వచ్చిన విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించిన నిరసనలు, పరస్పర నినాదాల హోరు మధ్య గురువారం మకర్ ద్వార్ వద్ద అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ముఖాముఖి తలపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

