అంబులెన్స్ ఆలస్యమైతే 10 వేల జరిమానా!
జాతీయ రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనలో జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) 10 నిమిషాల డెడ్‌లైన్‌ను తీసుకొచ్చింది.
- హైవేల్లో 10 కి.మీ పరిధిలో 10 నిమిషాల్లో చేరుకోవాలి
- ప్రమాదాల్లో జాప్యం నివారణకు ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనలో జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) 10 నిమిషాల డెడ్‌లైన్‌ను తీసుకొచ్చింది. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదస్థలికి 10 నిమిషాల్లోపు అంబులెన్స్ చేరుకోవాలని బుధవారం విడుదల చేసిన తన విధాన మార్గ దర్శకాల్లో పేర్కొంది.
ఇలా చేరుకోని పక్షంలో ప్రతి ఘటనలో రూ.10 వేలు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రమాదాల్లో సహాయ టికెట్ అభ్యర్థనను ఆమోదించినప్పటి నుంచి గంట లోపు దగ్గరలోని దవాఖానకు బాధితులను చేర్చాలని సూచించింది. దీన్ని ఉల్లంఘించిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశముందని చెప్పింది. 10 కిలోమీటర్ల పరిధి దాటిన ప్రమాదాల్లో అంబులెన్స్ చేరుకోవాల్సిన సమయం దామషా ప్రకారం పెరుగుతుందని.. ఇది జీపీఎస్ డేటా/ఐఎమ్ఎస్ కేర్ డ్యాష్ బోర్డ్ ద్వారా ధ్రువీకరణ అవుతుందని స్పష్టం చేసింది.
ఎమర్జెన్సీ టికెట్‌ను తిరస్కరిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఒప్పందాల్లో భాగంగా పరికరాలు, మందులు, సిబ్బందిని సమకూర్చని సంస్థలకు రూ.10 వేల జరిమానా వేస్తామని తెలియజేసింది. తాజా మార్గదర్శకాలను ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాంతీయ అధికారులు కట్టదిట్టంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే జాతీయ రహదారులపై వివిధ సేవల కోసం 1033 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

