హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీసెట్-2026)ను నేడు (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా 492కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సెట్ చీఫ్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణఆదిత్య శనివారం ప్రకటనలో తెలిపారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగుతుందని, అభ్యర్థులు 30నిమిషాల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో, 6నుంచి 9వ తరగతుల వరకు మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష కొనసాగనుండగా మొత్తంగా 1,82,061 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.