Azadi 501 On Aha | కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ ‘ఫ్రీడమ్ 251’ పేరుతో కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద డిజిటల్ స్కామ్ ఆధారంగా తెలుగులో ‘ఆజాదీ 501’ అనే వెబ్ సిరీస్ రాబోతుంది. రూ.20 వేలు సంపాదించే ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు రూ.501కే ఫోన్ ఇస్తానని చెప్పే ఆలోచన, దాని వెనుక ఉన్న ఆశయాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు మరియు కార్పొరేట్ మోసం నేపథ్యంలో ఈ టెక్ డ్రామాను మేకర్స్ రూపొందించారు.
శివతేజ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో తేజ కాట్రగడ్డ, హర్షవర్ధన్, గీతా భాస్కర్, శశాంక్, రవివర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థర్స్ డే సినిమాస్ బ్యానర్‌పై రచన రెడ్డి ములుముడి నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను జూలై 29 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.