Mumbai Woman | ముంబైలో ఓ మహిళ తనన పికప్ చేసుకునేందుకు రాపిడో బైక్ బుక్ చేసింది. ర్యాపిడో డ్రైవర్ వచ్చే వరకు రోడ్డు పక్కన ఎదురుచూసింది. త్వరలోనే ర్యాపిడో డ్రైవర్ పికప్ చేసుకుంటాడని యాప్‌లో చూపించింది
రైడర్ వచ్చే దాకా చాలా ఓపికగా చూసింది ఆ మహిళ. ర్యాపిడో రైడర్ రాగానే అతన్ని చూసిన మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతకీ షాకయ్యేంతలా ఆమె ఏం చూసిందనే కదా మీ డౌటు. రెగ్యులర్‌గా కనిపించే బైక్స్, స్కూటీ కాకుండా ఖరీదైన బీఎండబ్ల్యూ హై ఎండ్ బైక్ ఆమె దగ్గరకు వచ్చింది. ఈ విజువల్స్‌ను ఆమె తన కెమెరాలో రికార్డు చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేస్తూ .. ర్యాపిడోను ట్యాగ్ చేయండి.. ఈ రైడర్‌ను ఎక్కువ మంది జనాలకు తెలిసేలా చేయండి. గ్రే టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్స్ కాంబోలో స్మార్ట్ డ్రెస్ వేసుకున్న రైడర్ స్టైలిష్ ఎంట్రీ చూసి సర్ప్రైజ్ అయింది.
అతడు లొకేషన్‌కు రాగానే మీరు రైడ్‌ను రిక్వెస్ట్ చేశారా.. అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె అవును అని చెప్పగానే రైడర్ తన బైక్ ఫుట్ స్టాండ్‌ను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత సదరు మహిళ నవ్వుతూ బైక్ ఎక్కే ముందు బ్రో మీరు సింగిలా..? అని అడిగింది. క్లిప్ టాప్లోఇది చాలా తప్పు ర్యాపిడో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
దీదీ నన్ను ఎక్స్ పోజ్ చేసింది అంటూ లగ్జరీ రైడ్ చేసిన వ్యక్తి రీల్లో కామెంట్ పోస్ట్ చేశాడు. దీంతో ఇద్దరూ కేవలం వినోదం కోసమే ఇలా రీల్ చేశారని అర్థమవుతోంది. బైక్ రైడ్ చేసిన వ్యక్తి బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ కోచ్ అని పరోక్షంగా హింట్ కూడా ఇచ్చింది.
అంతకుముందు ఈమెనే అదే వ్యక్తితో ఇలాంటి వీడియో ఒకటి షేర్ చేసింది. పాత వీడియో రెడ్ డుకాటి సూపర్ బైక్‌తో చేయగా.. ఈ సారి దాని ప్లేస్‌లో బీఎండబ్ల్యూ బైక్‌ను వాడారు. ఇదంతా చదివిన, వీడియో చూసిన నెటిజన్లు ఇంతకీ అతడు సింగిలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు