న్యూఢిల్లీ/దుబాయ్: భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయింది. ఐఏఎఫ్ పైలట్ మరణించారు. అయినప్పటికీ నిర్వాహకులు ఎయిర్ షో కొనసాగించడంపై అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్ విచారం వ్యక్తం చేశారు. (US pilot quits Dubai air show) అయితే ఆ పైలట్ గౌరవార్థం ఎయిర్ షో నుంచి తన బృందం తప్పుకున్నదని ఆయన వెల్లడించారు. శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ కూలిపోయింది. ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ ఈ ప్రమాదంలో మరణించారు.
కాగా, యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం (యూఎస్ఏఎఫ్)కు చెందిన పైలట్, ఎఫ్-16 వైపర్ డెమోన్స్ట్రేషన్ టీమ్ కమాండర్ మేజర్ టేలర్ ‘ఫెమా’ హైస్టర్ ఈ సంఘటనపై శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ‘దుబాయ్ ఎయిర్ షో చివరి రోజున ఫైటర్ జెట్ విన్యాస ప్రదర్శనలో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మరణించారు. అయినప్పటికీ ఎయిర్ షో కొనసాగించాలని నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మరణించిన ఇండియన్ పైలట్, ఆయన సహచరులు, కుటుంబ సభ్యుల పట్ల గౌరవంతో మా తుది ప్రదర్శనను రద్దు చేయాలని మా బృందం నిర్ణయం తీసుకున్నది’ అని అందులో పేర్కొన్నారు.
Also Read:
Track Stray Dogs At Schools | స్కూల్స్లో కుక్కలను నియంత్రించాలని ఆదేశాలు.. మండిపడుతున్న ఉపాధ్యాయులు