Forests | మెదక్ రూరల్, మార్చి 03 : వన్యప్రాణుల మనుగడకు అడవులు అత్యంత కీలకమని, ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహమ్మద్ జలీల్ పిలుపునిచ్చారు. మంగళవారం ‘వన్యప్రాణి దినోత్సవాన్ని’ పురస్కరించుకుని మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి గ్రామ పంచాయతీలో అటవీ శాఖ, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పించడానికి చెట్లు నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి వృక్షాలుగా మారే వరకు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత గ్రామస్థులపై ఉందని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మానస రాములు, ఉప సర్పంచ్ మహేష్, ఫారెస్ట్ శిక్షణ ఆఫీసర్ శ్రీహరి, బీట్ ఆఫీసర్లు శోభారాణి, గబ్బర్ సింగ్, ధనలక్ష్మి, మరియు హరిత అధికారులు పాల్గొన్నారు. వార్డు సభ్యులు రూప విజయ్, నర్సింలు, మహేష్, సోనీ ప్రియా, సావిత్రి, నర్సింలు, మధు గౌడ్, సత్తెమ్మ, పోచ గౌడ్, ఆంజనేయులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు