Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడని బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టిన టీచర్..!
Varanasi teacher | నర్సరీ విద్యార్థి (Nursery student) పట్ల ఓ టీచర్ (Teacher) అమానవీయంగా ప్రవర్తించింది. లాగులో మూత్రం పోసుకున్నాడన్న కోపంతో.. కూరగాయలు కోసే కత్తిని వేడిచేసి ఆ బాలుడి మర్మాంగం (Private Part) పై వాతలు పెట్టింది. మూడు రోజుల క్రితం వారణాసి (Varanasi) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Varanasi teacher : నర్సరీ విద్యార్థి (Nursery student) పట్ల ఓ టీచర్ (Teacher) అమానవీయంగా ప్రవర్తించింది. లాగులో మూత్రం పోసుకున్నాడన్న కోపంతో.. కూరగాయలు కోసే కత్తిని వేడిచేసి ఆ బాలుడి మర్మాంగం (Private Part) పై వాతలు పెట్టింది. మూడు రోజుల క్రితం వారణాసి (Varanasi) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్‌పైన, పాఠశాలపైన కేసు నమోదైంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేసరి జైస్వాల్ కుమారుడు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ప్లే స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత నొప్పిగా ఉందని తల్లికి చూపించాడు. వాతలు ఉన్నట్లు గమనించిన తల్లి.. భర్తకు ఈ విషయం చెప్పింది. ఆ మర్నాడు స్కూలుకు వెళ్లి ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతో జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుమారుడు వాష్ రూమ్‌కు వెళ్తానని టీచర్‌ను అడిగినా..ఆమె పంపలేదని, మూత్రం నిక్కర్లో పోసేశాడని, అందుకు కోపగించిన ఆమె.. పక్క రూమ్‌కు తీసుకెళ్లి.. వాతలు పెట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన చర్య అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

