FSSAI | అధిక కెఫీన్ కలిగిన ఆ పానీయాలకు ఎనర్జీ డ్రింక్ అనే పదం వాడొద్దు : ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం
FSSAI | అధిక కెఫిన్ కలిగిన పానీయాలను ఎనర్జీ డ్రింక్స్ (Energy Drink) గా ప్రచారం చేయవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక ఆదేశాలు జారీచేసింది. పెప్సీ (Pepsi), రెడ్ బుల్ (Redbull), మాన్స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల లేబుళ్ల నుంచి 'ఎనర్జీ డ్రింక్' అనే పదాన్ని, దానికి సంబంధించిన వర్ణనలను 90 రోజుల్లోగా తొలగించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది.
FSSAI : అధిక కెఫిన్ కలిగిన పానీయాలను ఎనర్జీ డ్రింక్స్ (Energy Drink) గా ప్రచారం చేయవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక ఆదేశాలు జారీచేసింది. పెప్సీ (Pepsi), రెడ్ బుల్ (Redbull), మాన్స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల లేబుళ్ల నుంచి ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని, దానికి సంబంధించిన వర్ణనలను 90 రోజుల్లోగా తొలగించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది.
భారత్‌లో ‘ఎనర్జీ డ్రింక్స్’ పేరిట విక్రయిస్తున్న ఉత్పత్తులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రమాణాలు లేవని FSSAI పేర్కొన్నది. ‘శరీరానికి, మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది’ లేదా ‘శారీరక బలహీనతను తగ్గిస్తుంది’ వంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. బ్రాండింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలతో గతంలోనే రెడ్ బుల్, పెప్సీకోకు చెందిన స్టింగ్, రిలయన్స్ క్యాంపా ఎనర్జీ వంటి బ్రాండ్లకు సంస్థ నోటీసులు జారీచేసింది.
ఇటీవల పరిశ్రమ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో రజిత్ పున్హానీ ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలో నిబంధనలకు కట్టుబడి ఉంటామని కంపెనీలు అంగీకరించడంతో, లేబుళ్లు మార్పునకు సంబంధించి ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది. దేశీయంగా ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా 2017లో పెప్సీ కంపెనీ తక్కువ ధరకే ‘స్టింగ్’ బ్రాండ్‌ను పరిచయం చేయడంతో యువతలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటికి ఆదరణ గణనీయంగా పెరిగింది.
యూరోమానిటర్ అంచనాల ప్రకారం.. 2028 నాటికి భారత ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ విలువ 1.6 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

