రాంచీ: కాంగ్రెస్ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కోసం వచ్చే ఎన్నికల అధికారులను నిర్బంధించాలని అన్నారు. (Lock Up Poll Officials) దీనిపై బీజేపీ స్పందించింది. ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం (ఈసీ) అమలు చేస్తున్నది. అయితే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.
కాగా, జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఒక సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (సర్)లో భాగంగా ఎన్నికల అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు వారిని బంధించాలని ప్రజలను కోరారు. ‘ప్రతి ఒక్కరూ ‘సర్’కు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలి. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడానికి వస్తున్నారు. బీఎల్వో మీ ఇంటికి వస్తే వారిని లోపల నిర్బంధించండి. నేను వచ్చిన తర్వాతే విడుదల చేయండి’ అని అన్నారు.
మరోవైపు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని విమర్శించింది. మంత్రి అన్సారీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు.
Also Read:
Meerut Blue Drum Case | బిడ్డకు జన్మనిచ్చిన.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ముస్కాన్
US pilot quits Dubai air show | తేజస్ క్రాష్ తర్వాత.. ఎయిర్ షో నుంచి తప్పుకున్న అమెరికా పైలట్