Iranian drones : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దుబాయ్, సౌదీ, ఖతార్ సహా యూఏఈ దేశాలపై దుబాయ్ దాడులు చేస్తోంది. ముఖ్యంగా అక్కడి అమెరికన్ ఆర్మీ బేస్‌లపై ఇరాన్ దాడులకు దిగుతోంది. తాజాగా గురువారం కూడా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దుబాయ్‌లోని డౌన్ టౌన్ సిటీపై డ్రోన్ దాడి జరిగినట్లు, దీనివల్ల స్వల్పంగా నష్టం కలిగినట్లు దుబాయ్ అధికారులు తెలిపారు.
అయితే, ఈ దాడి ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదని, స్వల్ప గాయాలు తగిలాయని తెలిపింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో 24 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరణించిన వారిలో అమెరికాకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు. గురువారం ఉదయం దుబాయ్ తీరంలోని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఒక కంటైనర్ షిప్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో నౌకా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బ్రిటీష్ మిలిటరీ అధికారులు తెలిపారు. బహ్రెయిన్‌లోని ముహర్రక్ ఐలాండ్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.
కువైట్‌లోని ఒక నివాస భవనంపై ఇరాన్ జరిపిన దాడిలో ఇద్దరు గాయపడ్డట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ ప్రయోగించిన ఒక డ్రోన్‌ను రియాద్ సమీపంలో నేలకూల్చినట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఇప్పటివరకు ఇరాన్ యుద్ధం కారణంగా జరిగిన దాడుల్లో మొత్తం 19 వాణిజ్య నౌకలపై దాడి జరిగింది. ఇంకోవైపున ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.