Iran Conflict: పెంటగాన్ అంచనా.. తొలి 6 రోజుల్లో అమెరికా యుద్ధం ఖర్చు 11 బిలియన్ల డాలర్లు
Iran Conflict: పెంటగాన్ లెక్కలు వేసింది. ఇరాన్‌పై దాడి చేసిన ఖర్చును వెల్లడించింది. తొలి 6 రోజుల్లో అమెరికా యుద్ధం ఖర్చు 11 బిలియన్ల డాలర్లు అయినట్లు పెంటగాన్ అధికారులు చట్టసభ ప్రతినిధులకు చెప్పినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఓ మీడియా కథనాన్ని రాసింది.
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం(Iran Conflict) మొదలైన మొదటి ఆరు రోజుల్లో అమెరికా సుమారు 11.3 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్ ఈ విషయాన్ని ఆదేశ చట్టసభ ప్రతినిధులకు తెలియజేసినట్లు ఓ మీడియా కథనం పేర్కొన్నది. అనూహ్య రీతిలో ఇరాన్ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో.. అమెరికా భారీగా తన ఆయుధ సంపత్తిని వినియోగించాల్సి వస్తున్నది. ఆయుధాలను విరివిగా వాడుతోంది. దీంతో ఖర్చు విపరీతంగా అవుతున్నట్లు అంచనాలు వేస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇంకా చాలా విషయాల్లో ఖర్చును మినహాయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఖర్చును కూడా జోడిస్తే, అప్పుడు యుద్ధం ఖర్చు తొలి వారంలోనే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు మీడియా కథనంలో వెల్లడించారు. అమెరికా రక్షణశాఖ అధికారులు ఇదే విషయాన్ని ఆ దేశ చట్టసభ ప్రతినిధులకు కూడా చెప్పారు. కేవలం తొలి రెండు రోజుల్లోనే సుమారు 5.6 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధాలను వాడినట్లు తెలుస్తోంది. ఇది అంచనా వేసిన దాని కన్నా అధికంగా ఉన్నట్లు తేల్చారు.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం తొలి 100 గంటల్లోనే సుమారు 3.7 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వాషింగ్టన్కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తన రిపోర్టులో పేర్కొన్నది. రోజుకు దాదాపు 891 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తేల్చారు. ఇరాన్ యుద్ధ ఖర్చులను ట్రాక్ చేస్తున్న ఓ వెబ్సైట్ ప్రకారం. గురువారం వరకు అమెరికా ఈ యుద్ధం కోసం సుమారు 17 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఆ సైట్ అంచనా ప్రకారం ప్రతి రోజు యుద్ధం కోసం బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.
నిజానికి ఈ ఖర్చు ఇంకా ఎక్కువే ఉంటుందని, ఎందుకంటే సుదీర్ఘకాలం ఆలోచిస్తే, దీంట్లో వెటరన్ హెల్త్‌కేర్ ఉండదని, ఒకవేళ దాన్ని కూడా జోడిస్తే అప్పుడు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

