చందూర్, నవంబర్ 24 : నిజామాబాద్ జిల్లా చందూర్లోని ప్రభుత్వ మైనారిటీ గురుకు ల పాఠశాలలో పదో తరగతి వి ద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాఠశాలలో పదోతరగతి చదువుతు న్న షేక్ మూసా (16) అనారోగ్యంతోపాటు ఆధార్ అప్డేట్ చేయించుకునేందుకు సెలవుపై 21న పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాడు. తిరిగి ఆదివారం ఉదయం పాఠశాలకు వచ్చాడు. ఆదివారం అ ర్ధరాత్రి హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ; అధ్యాపకుడి వేధింపులే కారణమని ఆరోపణ
కారేపల్లి, నవంబర్ 24 : అధ్యాపకుడి వేధింపులు తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి లారీ కిందపడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో సోమవారం ఆలస్యంగా వెగులులోకి వచ్చింది. విద్యార్థి, అతడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండలం పాత లింగాలకు చెందిన విద్యార్థి కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ఎకనామిక్స్ అధ్యాపకుడు విద్యార్థులను సాయంత్రం 5 గంటల వరకు స్టడీ అవర్లో ఉంచాడు. పాత లింగాలకు చెందిన విద్యార్థి తమ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం సక్రమంగా లేదని, సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో ఉండడం వల్ల ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని అభ్యర్థించా డు. ఆంగ్ల అధ్యాపకుడు తోటి విద్యార్థుల ముందు సదరు విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించాడు. మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంటికి వెళ్లే సమయంలో లారీ కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. పకనే ఉన్న అతడి సోదరుడు, ఇతరులు అప్రమత్తమై ఆ విద్యార్థిని కాపాడారు.