T20 World Cup | ఐదోసారి సెమీస్‌లో ఇంగ్లండ్.. మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ బ్రూక్‌దే..!
T20 World Cup : వరుసగా రెండో విజయంతో గ్రూప్ బీ నుంచి ఇంగ్లండ్ తొలి సెమీస్ బెర్తు పట్టేసింది. మొత్తంగా ఐదోసారి పొట్టి కప్‌లో సెమీఫైనల్ గడప తొక్కిందీ మాజీ ఛాంపియన్.
T20 World Cup : టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు కొల్లగొట్టిన ఇంగ్లండ్ మూడో కప్ వేటలో మరో అడుగు వేసింది. పల్లెకెలె స్టేడియంలో వన్ మ్యాన్ షోతో చెలరేగిన హ్యారీ బ్రూక్ (Harry Brook) సెంచరీతో గర్జించగా.. పాకిస్థాన్‌పై రెండు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది ఇంగ్లండ్. వరుసగా రెండో విజయంతో గ్రూప్ బీ నుంచి తొలి సెమీస్ బెర్తు పట్టేసింది. మొత్తంగా ఐదోసారి పొట్టి కప్‌లో సెమీఫైనల్ గడప తొక్కిందీ మాజీ ఛాంపియన్. పాక్‌పై శతకంతో కదం తొక్కిన బ్రూక్ పొట్టి వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున మూడో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.
లీగ్ దశలో వెస్టిండీస్ చేతిలో 30 పరుగుల ఓటమితో తేరుకున్న ఇంగ్లండ్.. నాకౌట్లో మాత్రం ప్రత్యర్థులపై పంజా విసురుతోంది. శ్రీలంకను 51 పరుగుల తేడాతో చిత్తు చేసిన బ్రేక్ సేన.. పాకిస్థాన్‌పై 2 వికెట్లతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. 2016 నుంచి 2026 మధ్య కాలంలో ఆ జట్టు సెమీస్ చేరడం ఇది ఐదోసారి. పాక్, శ్రీలంక నాలుగేసి పర్యాయాలు సెమీస్ ఆడాయి.
England are the first team through!
Harry Brook’s ton sees the team to their fifth consecutive men’s T20 World Cup semi-final 🔥 pic.twitter.com/QmNTNlkQtW
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2026
టీ20 వరల్డ్‌కప్ ఛేదనలో అత్యధిక స్కోర్.. రికార్డు ఇంగ్లండ్‌కే చెందిన అలెక్స్ హేల్స్ పేరిట ఉంది. 2014లో అతడు శ్రీలంకపై 116 పరుగులతో అజేయంగా జట్టును గెలిపించాడు. 2016లో క్రిస్ గేల్ (100 నాటౌట్) ఇంగ్లండ్‌పై, పథుమ్ నిశాంక(100 నాటౌట్) 2026 ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదగా.. హ్యారీ బ్రూక్ పాక్‌పై శతకంతో ఈ జాబితాలో చేరాడు.
ఇంగ్లండ్ తరఫున వీళ్లే..
ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ బాదిన ఆటగాళ్లలో హ్యారీ బ్రూక్‌ది మూడో స్థానం. అగ్రస్థానంలో అలెక్స్ హేల్స్ ఉండగా.. 2021 ఎడిషన్‌లో శ్రీలంకపై షార్జాలో శతక్కొట్టిన జోస్ బట్లర్ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ వీరుల జాబితాలో ముగ్గురే ఉన్నారు. వీరిలో బట్లర్, డేవిడ్ మలన్ ఉండగా.. తాజా సెంచరీతో బ్రూక్ కూడా చోటు సంపాదించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

