రేవంత్ మెంటల్ స్టేటస్ బాలేదు
‘మూడేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి మెంట ల్ కండీషన్ బాగాలేదు’ అంటూ మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి హోదా లో ఉండి ఏం మాట్లాడుతున్నడు.. అధికారమున్నదనే అహంకారంతో కండ్లు నెత్తికెక్కినయ్..
- మూడేండ్ల నుంచి ప్రజలు చూస్తున్నరు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- వాడరాని భాష వాడితే ఆయనకే నష్టం
- హోదాకు ముఖ్యమంత్రి తగ్గట్టు మాట్లాడాలె
- అధికారం ఉందన్న అహంకారంతో ఎట్లపడితేఅట్ల మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించరు
- ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు హుందాగావ్యవహరించాలె.. ఆత్మపరిశీలన చేస్కోవాలె
- దేవుడు సద్భుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్న!
- సిద్దిపేట సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపైమునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ‘మూడేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి మెంట ల్ కండీషన్ బాగాలేదు’ అంటూ మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి హోదా లో ఉండి ఏం మాట్లాడుతున్నడు.. అధికారమున్నదనే అహంకారంతో కండ్లు నెత్తికెక్కినయ్.. వాడరాని భాష వాడితే వాళ్లకే నష్టం’ అని హితవు పలికారు. అందుకే జ్ఞానోదయం కావాలని ఆ అయ్యప్పస్వామిని వేడుకుంటున్నానని చెప్పారు. సిద్దిపేట సభలో పిచ్చికుక్కలు, ఎర్రికుక్కలు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలు యూట్యూబ్ చానళ్ల వేదికగా ఆయన ఈ విధంగా స్పందించారు. ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలని, అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజానీకం, చరిత్ర ఎప్పటికీ క్షమించదనే విషయాన్ని మరువొద్దని సీఎం రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదృష్టంకొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, దుర్మార్గపు పాలన సాగించే పాలకులకు హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్యనేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్పస్వామిని వేడుకుంటున్నానని’ అని పేర్కొన్నారు.
సీఎం భాష, వ్యవహారశైలి చాలా బాధ కలిగించింది
ముఖ్యమంత్రి మాట్లాడే భాష, వ్యవహారశైలి తనకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆవేదనతో చెప్పారు. రాష్ట్ర ప్రజల సొమ్మును, ప్రభుత్వ ఖజానా నుంచి కొందరు వ్యక్తులే తమ సొంత నియోజకవర్గాలకు తీసుకెళ్లడం సరికాదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఉన్నాయనే కారణంతో సొంత నియోజకవర్గాలకు రూ.వేల కోట్ల నిధులు తరలించకపోతే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. అభివృద్ధిలో వెనుకబడిన మునుగోడుతోపాటు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు కూడా సమానంగా నిధులు అందాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టంచేశారు. కొడంగల్‌కు నిధుల కేటాయింపు విషయంలో ప్రశ్నిస్తే ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ సీఎం వ్యాఖ్యానించడం తనకు ఎంతో బాధ కలిగించిదని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అలాంటి మంచి బుద్దిని ప్రసాదించాలని ఆయ్యప్పస్వామిని వేడుకుంటున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
నేను.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు ఎలాంటి విభేదాలు లేవని, మాట్లాడిన దానిలో పార్టీకి, సీఎంకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు లేవని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. సీఎం వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శుక్రవారం ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘సీఎం వ్యాఖ్యలు తననుద్దేశించి కాదు.. నేను ఏది మాట్లాడినా బహిరంగంగా అంటాను. ముందు ఒకటి.. వెనుక మరోలా మాట్లాడే వ్యక్తిత్వం కాదు. సీఎంను విమర్శించడం కానీ, పార్టీని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. జడ్చర్లలో రోడ్లు మంచిగా లేక నిత్యం ప్రమాదాలు జరుగుతునాయని, అవి పూర్తిచేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. క్షేత్రస్థాయిలో అవినీతికి సంబంధించి గతంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలనే తాను చెప్పానని, అవినీతిని అడ్డుకునేందుకే ప్రతి నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

