ద్రోహం చేసే పార్టీలు మనకొద్దు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఏ జాతీయ రాజకీయ పార్టీ దయాదాక్షిణ్యాల వల్ల జరగలేదు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటం, వందలాది మంది అమరుల త్యాగాలు, లక్షలాది మంది ప్రజల ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలు ఆశించింది కేవలం పరిపాలన మార్పు కాదు. తమ నీళ్లు, నిధులు, నియామకాలు, వనరుల్లో హక్కులను సాధించుకోవడానికి, భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్వయం పాలన ఉండాలని కోరుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఏ జాతీయ రాజకీయ పార్టీ దయాదాక్షిణ్యాల వల్ల జరగలేదు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటం, వందలాది మంది అమరుల త్యాగాలు, లక్షలాది మంది ప్రజల ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలు ఆశించింది కేవలం పరిపాలన మార్పు కాదు. తమ నీళ్లు, నిధులు, నియామకాలు, వనరుల్లో హక్కులను సాధించుకోవడానికి, భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్వయం పాలన ఉండాలని కోరుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. కేవలం తమ రాజకీయ అవసరాలు, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ సమీకరణలకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ హక్కులను పూర్తిగా విస్మరించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతూ కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ, ఆంధ్రాలోని ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం వల్ల తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాల వినియోగంలో తీవ్ర అన్యాయం జరిగింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ గణనీయ వాటా కలిగి ఉన్నప్పటికీ, నీటి వినియోగంలో న్యాయమైన ప్రయోజనాలు దక్కడం లేదు. ఒకవైపు తెలంగాణ రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయే ప్రాజెక్టుల సామర్థ్యాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతూపోయింది.
తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్ర ఆవిర్భావానికి కొన్ని రోజుల ముందు 2014 మే 27న ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు మాత్రమే కాదు. సీలేరు జలవిద్యుత్తు కేంద్రం, అటవీ సంపద, ఖనిజ వనరులు, గిరిజన ప్రాంతాలపై తెలంగాణకు ఉండాల్సిన పరిపాలనా సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలు కూడా దెబ్బతిన్నాయి. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం మాత్రమే తెలంగాణలో ఉన్నది. ఆలయానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ కావడంతో ఆక్రమణలకు గురయ్యాయి. పరిసర ప్రాంతాల భౌగోళిక, పరిపాలనా పరిస్థితులపై ఈ విలీనం ప్రభావం చూపింది. ఈ ఏడు మండలాల బదిలీకి సంబంధించిన నిర్ణయం యూపీఏ ప్రభుత్వ కాలంలోనే తీసుకున్నప్పటికీ, మోదీ సర్కార్ తెలంగాణ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే 2014 మేలో ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించిన రాజకీయ బాధ్యత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీదే. తెలంగాణ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పరిష్కారం చూపడంలో ఆ రెండు పార్టీలూ విఫలమయ్యాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం నాగార్జునసాగర్ జలాశయం నుంచి పల్నాడు ప్రాంతానికి తాగునీరు అందించే పేరుతో చేపడుతున్న నీటి సరఫరా ప్రాజెక్టు మరోసారి తెలంగాణ ప్రయోజనాలపై చర్చకు దారితీసింది. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి 1.865 టీఎంసీల నీటిని తరలించేందుకు యత్నిస్తున్నది.
జలాశయంలోని తక్కువ నీటిమట్టం వద్ద కూడా జలాలను తీసుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధి, అనుమతులు, రెండు రాష్ర్టాల నీటి వాటాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాలు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఒక రాష్ట్ర ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలను దెబ్బతీసే విధంగా మరొక రాష్ట్రం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించడానికి కేఆర్ఎంబీ అనుమతించకూడదు. రేవంత్‌రెడ్డికి చంద్రబాబుతో ఉన్న రాజకీయ సాన్నిహిత్యం, వ్యక్తిగత సంబంధాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమా? తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత ఎందుకు చూపలేదు? బీఆర్ఎస్ ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని ప్రజల దృష్టికి తీసుకువచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ నెల 18న మొద్దు నిద్ర నుంచి లేచిన నీటిపారుదలశాఖ అధికారులు, ఏదో మొక్కుబడిగా కేఆర్ఎంబీకి అధికారికంగా ఫిర్యాదు చేశామని చెప్తున్నారు.
తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థల కేటాయింపుల్లో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కేవలం నీటి విషయంలోనే కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు, జాతీయ ప్రాజెక్టులు, విద్యాసంస్థల కేటాయింపుల్లో కూడా అన్యాయం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమల్లోనూ అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా విషయంలోనూ తెలంగాణకు నిరాశే ఎదురైంది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం చూపిస్తున్న ప్రాధాన్యతను గమనిస్తే రెండు రాష్ర్టాల పట్ల కేంద్ర వైఖరిలో సమానత్వం ఉన్నదా అనే ప్రశ్న సహజంగానే వస్తున్నది. తెలంగాణకు వైద్య, విద్య, పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కేటాయింపులోనూ కేంద్రం శ్రద్ధ చూపడంలేదు.
రాష్ర్టానికి రావాల్సిన నిధులు, హక్కులు ఏవీ రాజకీయ నాయకుల వ్యక్తిగత పలుకుబడిపై ఆధారపడకూడదు. జాతీయ పార్టీలకు తెలంగాణ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, బీజేపీ అనేక హామీలు ఇస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయ లెక్కలకే ప్రాధాన్యత ఇస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ కీలక రాజకీయ భాగస్వామిగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా చంద్రబాబుతో రాజకీయ సంబంధాలు, సాన్నిహిత్యం ఉన్నాయి. తెలంగాణ హక్కుల విషయంలో ఈ రెండు పార్టీలూ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు.
కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ రాజకీయ మిత్రపక్షాల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడుతూ చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలు, రాజకీయ సిద్ధాంతాలు, వ్యక్తిగత సంబంధాలు పక్కన పెట్టాలి.
తెలంగాణకు రావాల్సిన నిధులు, నీళ్లు, ప్రాజెక్టులు, విద్యాసంస్థలు సాధించాలి. ఏపీకి మేలు చేయడాన్ని తెలంగాణ ప్రజానీకం వ్యతిరేకించడం లేదు. కానీ మన హక్కులను బలిపెట్టడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేని, మన గోస పట్టని, మనకు ద్రోహం చేసే పార్టీలు మనకెందుకు? అసలే వద్దు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడే నాయకత్వాలు మనకు అవసరమా? ప్రజలు ఇకనైనా రాష్ట్ర ప్రయోజనాల పట్ల పార్టీల నిబద్ధతను చూసి నిర్ణయం తీసుకోవాలి. అన్యాయం చేసేవారిని ప్రశ్నించాలి. తెలంగాణ హక్కుల కోసం నిలబడే వారికే మద్దతు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రతీక. తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యత కావాలి. జాతీయ పార్టీల రాజకీయ ప్రయోజనాలు కాదు.
(వ్యాసకర్త: న్యాయవాది)
తన్నీరు శ్రీరంగారావు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

